- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jharkhand polls: అక్రమ వలసలను నిలువరిస్తాం.. బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లోకి అక్రమ వలసలను నిలువరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. రాంచీలో నిర్వహించిన(Jharkhand elections) ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా ‘సంకల్ప్ పత్ర’(BJP's sankalp patra) పేరుతో బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. సోరెన్ ప్రభుత్వ పాలనలో అక్రమవలసదారుల సంఖ్య అధికమవుతుందన్నారు. సంతాల్ పరగణాలో గిరిజన జనాభా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చొరబాటుదారులు ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే చట్టం తెస్తుందని తెలిపారు. అక్రమార్కులు ఇక్కడికి వచ్చి ఆడబిడ్డలను ప్రలోభపెట్టి పెళ్లిళ్లు చేసుకొని భూములను ఆక్రమించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని అరికట్టకపోతే రాష్ట్ర సంస్కృతికి, ఉపాధికి, ఆడబిడ్డలకు భద్రత ఉండదని అన్నారు. జార్ఖండ్ లో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) ప్రవేశపెడతామని.. అయితే గిరిజనులను దానికి దూరంగా ఉంచుతామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,100 ఇస్తామని ప్రకటించారు.
హేమంత్ సోరెన్ పై ఆగ్రహం
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా బీజేపీ సంక్షేమ పథకాలను రూపొందిస్తోందని అమిత్ షా అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని అన్నారు. పేపర్ లీక్‌లకు పాల్పడుతున్న వారిపై సీబీఐ, సిట్ సోదాలు నిర్వహించి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు భద్రత కల్పించే విషయంలో సోరెన్ విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. వారందరికీ తగిన బుద్ధి చెప్పడానికి బీజేపీని గెలిపించాలని కోరారు. ఇకపోతే, జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ నెల 13, 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.