- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీన్ పాయింట్లు, టీ షర్ట్‌లు బ్యాన్.. ప్రభుత్వ టీచర్లకు సర్కారు బిగ్ షాక్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో జీన్స్, లెగ్గిన్ లను బ్యాన్ చేస్తూ అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నడిపే అన్ని పాఠశాలల్లో డ్రెస్ కోడ్ తప్పని సరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పురుష, మహిళ టీచర్లు టీ షర్ట్స్, జీన్స్, లెగ్గింగ్స్ వేసు కోవద్దని ప్రభుత్వం సూచించింది. బాధ్యత గల టీచర్లు ప్రవర్తన విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున డ్రెస్ కోడ్ నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం ప్రభుత్వం తెలిపింది. కొన్ని సందర్భాలలో ఉపాధ్యాయుల డ్రెసింగ్ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని అస్సాం ప్రభుత్వం తెలిపింది.
పార్టీ వేర్, క్యాజువల్ అప్పియరల్స్ స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులకు సూచించింది. ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్ లనే ధరించాలని టీచర్లకు సూచించింది. ఇదే అంశంపై అస్సాం విద్యా శాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగూ మాట్లాడుతూ.. అస్సాం ప్రభుత్వం పాఠశాల పాలనా పుస్తకాన్ని అందుబాటులోకి తేనుందన్నారు. ఈ పుస్తకంలో పాఠశాలను ఎలా మేనేజ్ చేయాలి.. తరగతి గదులను ఎలా కండక్ట్ చేయాలనే అంశాలను పొందుపర్చినట్లు తెలిపారు. ఈ పాలనా పుస్తకంలో పాఠశాలలో టీచర్లు డీసెంట్ గా డ్రెస్ వేసుకోవడం, విద్యార్థులు తప్పని సరిగా యూనిఫాం ధరించేలా మార్గదర్శకాలు ఉంటాయన్నారు. ఫార్మల్ డ్రెస్ లో మాత్రమే ఉపాధ్యాయులు పాఠశాలకు రావాలని ఆయన కోరారు.
Also Read..