- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనవరి 22 ఒక తేదీ కాదు.. మరో కొత్త చరిత్ర: ప్రధాని మోడీ
దిశ, వెబ్‌డెస్క్: భారత దేశ పౌరుల శతాబ్దాల కలనెరవేరిందని ప్రధాని మోడీ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అయోధ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఇలా అన్నారు. గర్భ గుడిలో శ్రీ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట లో పాల్గొనడం నా అదృష్టం అన్నారు. ఈరోజు మన రాముడు అయోధ్యకు వచ్చేశాడు. ఈ సందర్భంగా రామ భక్తులందరికీ శుభాకాంక్షలు, గర్భ గుడిలో ఉన్నంత సేపు బాల రాముడి రూపం తన మనస్సులో ఉండి పోయింది. నా మనస్సు, శరీరం మొత్తం బాల రాముడితో నిండిపోయింది.
ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి గొప్ప కార్యంలో పాల్గోనలేమని ప్రధాని మోడీ అన్నారు. అలాగే రాముడు ఓ సాధారణ టెంటులో ఉండలేడు. కేవలం గర్భగుడిలో మాత్రమే ఉంటాడు. నేడు శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 50 కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ గొప్ప కార్యం నిర్వహించిన జనవరి 22 కేవలం ఒక తేదీ కాదు. ఈ రోజు ప్రపంచంలో మరో కొత్త చరిత్రను సృష్టించింది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట మరో 1000 సంవత్సరాల వరకు గుర్తుండి పోతుందని.. ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.