Janaushadhi scheme: జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచుతాం.. డాక్టర్ అరుణిష్ చావ్లా

by vinod kumar |
Janaushadhi scheme: జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచుతాం.. డాక్టర్ అరుణిష్ చావ్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ ఐషది స్కీమ్‌తో ప్రజలు 90శాతం వరకు తగ్గింపుతో మెడిసిన్స్ పొందొచ్చు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ స్కీమ్ అమలు అవుతోంది. ప్రజలకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నట్టు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి డాక్టర్ అరుణిష్ చావ్లా తెలిపారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో జన్ ఔషది కేంద్రాల గురించి వివరించారు. ‘జన్ ఔషధి అనేది భారత ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. వచ్చే మూడేళ్లలో జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచుతామని ఇటీవలే ప్రధాని మోడీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలు వేగంగా ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం 13,000 పైగా పనిచేస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ) సీఈవో రవి దధీచ్ మాట్లాడుతూ.. జన్‌ ఔషధి ఔషధాల ఉత్పత్తిలో భారత్‌కు వివిధ రాష్ట్రాల్లో 10,000 తయారీ యూనిట్లు ఉన్నాయని వెల్లడించారు. తయారీదారులు అత్యధిక నాణ్యత ప్రమాణాలకు హామీ ఇవ్వడానికి డబ్లూహెచ్‌ఓ సర్టిఫికేట్ పొందారని తెలిపారు. ఉత్తమ నాణ్యత గల మందులను అందుకుంటామని, మందులు అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, అవి జాతీయ స్థాయి జన్ ఔషధి కేంద్ర గోదాముకు సరఫరా చేస్తామని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు సేవలందించేందుకు గౌహతి, చెన్నయ్, బెంగళూరు, సూరత్‌లలో ఇలాంటి గిడ్డంగులు ఉన్నాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed