Jaiswal: యూనస్ ప్రభుత్వం మైనారిటీలందరినీ రక్షించాలి.. ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్

by vinod kumar |
Jaiswal: యూనస్ ప్రభుత్వం మైనారిటీలందరినీ రక్షించాలి.. ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలు బెదిరింపులు, దాడులను ఎదుర్కొంటున్నారని వీరందరినీ రక్షించాల్సిన బాధ్యత మహమ్మద్ యూనస్ (Mohammad younas) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానిదేనని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Ranadheer Jaiswal) అన్నారు. హింస, రెచ్చగొట్టే చర్యలపై భారత్ ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. ప్రతీవారం నిర్వహించే మీడియా సమావేశంలో భాగంగా బంగ్లాదేశ్(Bangladesh) ప్రస్తుత పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ విషయంలో స్పష్టంగా ఉన్నామని మైనారిటీల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్‌కు సూచించారు.

హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్‌(chinmoy krishna das)ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేయడంపై స్పందిస్తూ..ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోందని భారత్ గుర్తించిందన్నారు. ఈ ప్రక్రియలు కేసును న్యాయంగా, పారదర్శకంగా వ్యవహరిస్తాయని, నిందితులందరి చట్టపరమైన హక్కులను గౌరవిస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు సరుకుల సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జైస్వాల్ స్పందించారు.

Advertisement

Next Story