అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్ వాకథాన్‌

by S Gopi |
అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్ వాకథాన్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు కూడగట్టేందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆదివారం దేశ రాజధానిలో 'జైల్ కా జవాబ్ ఓట్ సే' వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎంపీ సంజయ్ సింగ్, మంత్రి గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్‌తో సహా ఆప్ కీలక నేతలు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మదతుదారులు 'జైలు శిక్షకు ఓటుతో జవాబిద్దాం, అరవింద్ కేజ్రీవాల్ జిందాబాద్, వందేమాతరం' నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఢిల్లీ మంత్రి, ఆప్ నేత గోపాల్ రాయ్ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం అన్యాయమని, రాజకీయ దురుద్దేశంతోనే ఆయనను జైల్లో వేశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎలాంటి ఆధారాలు, ఎఫ్ఐఆర్ లేకుండా ప్రజాస్వామ్యయుతంగా భారీ మెజారిటీతో గెలిచిన కేజ్రీవాల్‌ను బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపింది. బీజేపీ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఢిల్లీ సమాజంలోని ప్రతి వర్గం కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం పట్ల కలత చెందుతున్నారని' గోపాల్ రాయ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed