Waqf Bill: వక్ఫ్ బిల్లు జేపీసీ చైర్‌పర్సన్‌గా జగదాంబికా పాల్ నియామకం

by Harish |   ( Updated:2024-08-13 12:41:52.0  )
Waqf Bill: వక్ఫ్ బిల్లు జేపీసీ చైర్‌పర్సన్‌గా జగదాంబికా పాల్ నియామకం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్(సవరణ) 2024 బిల్లు వివాదాస్పదం అయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో బిల్లుపై చర్చించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని నియమించింది. తాజాగా ఈ కమిటీకి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లోక్‌సభ సభ్యుడు జగదాంబికా పాల్ చైర్‌పర్సన్‌‌గా నియామకం అయ్యారు. మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 కమిటీకి చైర్‌పర్సన్‌గా పాల్‌ను నియమించారు. జగదాంబికా పాల్ ఉత్తరప్రదేశ్ నుండి నాల్గవసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన వివిధ పార్టీ నాయకుల మధ్య స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నారు.

ఈ కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 21 మంది లోక్‌సభ,10 మంది రాజ్యసభ సభ్యులు. అంతకుముందు కేంద్రం, వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలను కట్టడి చేయడానికి, బోర్డులో మహిళలను తప్పనిసరి చేయడం, ముస్లిమేతర సభ్యులను చేర్చడం వంటి పలు సవరలు చేయాలని బిల్లును ప్రవేశపెట్టగా దీనికి విపక్ష సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నప్పటికి నిరసలను తీవ్రం కావడంతో బిల్లుపై చర్చించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించారు.

Advertisement

Next Story

Most Viewed