ITR Filing : జులై 31 తర్వాత వారికి రూ.5వేల ఫైన్.. ఎందుకో తెలుసా ?

by Hajipasha |
ITR Filing : జులై 31 తర్వాత వారికి రూ.5వేల ఫైన్.. ఎందుకో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు కట్టారా ? కట్టకపోతే ఇప్పటికైనా అలర్ట్ అయిపోండి. ఎందుకంటే ఉచితంగా ఐటీఆర్ ఫైల్ చేసే గడువు జులై 31వ తేదీతో ముగియబోతోంది. ఆ తర్వాత ఫైల్ చేస్తే భారీ జరిమానాను భరించాల్సి వస్తుంది. ఉచితంగా ఫైల్ చేసే గడువు ముగిశాక.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారిలో రూ.5 లక్షలకుపైగా వార్షిక ఆదాయం కలిగినవారు రూ.5వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షలలోపు వార్షిక ఆదాయం కలిగినవారు రూ.1000 దాకా జరిమానా కట్టాలి. బీలేటెడ్‌ ఐటీ రిటర్నులను ఈ ఏడాది డిసెంబర్ 31లోగా జరిమానాలతో సహా ఫైల్ చేయొచ్చని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

ఈ సీజన్‌లో ఇప్పటికే లక్షల మంది తమ ఐటీఆర్‌లు దాఖలు చేశారు. గడువు దాటిన తర్వాత ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే కొన్ని బెనిఫిట్స్ కూడా తం కోల్పోవాల్సి వస్తుంది.పెట్టుబడులపై వచ్చిన నష్టాలను (హౌస్‌ ప్రాపర్టీ నష్టం మినహా) తర్వాతి ఏడాదికి ఫార్వర్డ్‌ చేయలేరు. గడువులోగా ఐటీఆర్ ఫైల్‌ చేస్తే పెట్టుబడులపై వచ్చే నష్టాలను 8 ఏళ్ల వరకు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే రాబోయే ఎనిమిదేళ్లలో పెట్టుబడులపై లాభాలు వస్తే వాటిని నష్టాలతో భర్తీ చేసి పన్ను మినహాయింపును కోరవచ్చు. ఐటీ రిటర్నుల్లో తప్పులున్నట్లు తేలితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed