బోర్డ‌ర్లో 'క‌ర్చీఫ్‌ గేమ్‌', మంచు ప‌ర్వ‌తంపై జ‌వానుల జాలీ టైమ్ (వీడియో)

by Sumithra |
బోర్డ‌ర్లో క‌ర్చీఫ్‌ గేమ్‌, మంచు ప‌ర్వ‌తంపై జ‌వానుల జాలీ టైమ్ (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఎముక‌లు కొరికే చ‌లి, జోరున క‌మ్మేసే ద‌ట్ట‌మైన‌ మంచు, అల‌సిపోని నిశ‌బ్దం మ‌ధ్య ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) విధులు నిర్వ‌హించ‌డం ఎంతో క‌ష్టంతో కూడుకున్న‌ప‌ని. అందుకే, హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన హిమాలయాల్లో ప‌నిచేసే ITBP సైనికులను 'హిమ్‌వీర్స్' అని పిలుస్తారు. తాజాగా ఈ ప్రాంతంలో ద‌ట్ట‌మైన మంచు కురుస్తుండ‌గా సైనికులు వ‌త్తుగా ప్యాడెడ్ హుడ్ జాకెట్లు, బూట్లతో ధ‌రించి, కాసేపు స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డిపారు. ITBP షేర్ చేసిన ఈ వీడియోలో హిమ్‌వీర్‌లు 'క‌ర్చీఫ్‌ వదిలే' ఆట‌ ఆడుతుంటారు. కొంద‌రు సైనికులు మంచులో కూర్చొని ఉండ‌గా, ఆ సర్కిల్ చుట్టూ ఒక్కోసారి ఒక్కో జ‌వాను పరిగెడుతూ, రుమాలు వ‌దిలేసే ఈ గేమ్ వారికి కొంత ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని పంచుతుంది.

స్నేహితులతో చిన్న‌త‌నంలో ఆడే ఈ ఆటను దేశాన్ని ర‌క్షిస్తున్న జ‌వానులు ఆడుతుంటే చూసి నెటిజ‌నులు సంతోషిస్తున్నారు. ఇలాగే, కొంతకాలం క్రితం, ITBP జవాన్లు మైన‌స్ 20 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో భారతదేశం-చైనా సరిహద్దులో 15,000 అడుగుల ఎత్తులో వాలీబాల్ ఆడుతూ కనిపించారు. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 14,000 అడుగుల ఎత్తులో సరిహద్దుల్లో గస్తీ కాసే వీళ్లు మంచులోనే వారి శారీరక శిక్షణ, ఇతర కార్యకలాపాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా ఇలాంటి ఆట‌లు ఆడుతూ గడుపుతుంటారు.

Advertisement

Next Story