- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహిళలు, పిల్లలపై దాడులు చేస్తున్న పాలస్తీనాకు కాంగ్రెస్ మద్దతివ్వడం సరైంది కాదు : బసవరాజ్ బొమ్మై

దిశ, వెబ్ డెస్క్ : హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడిన క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం హుబ్బళ్లిలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బొమ్మై మాట్లాడుతూ.. పాలస్తీనాలో ఉగ్రవాదులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ఇది అంతర్జాతీయ అంశమని, ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఏళ్ల తరబడి ఘర్షణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై ప్రస్తుతం హమాస్ సంస్థ ఉగ్రవాదులు దాడులు చేశారని, హమాస్ సభ్యులు పాలస్తీనా అధికారిక పౌరులు కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ వాస్తవాన్ని ప్రజలకు దాచిపెట్టి, పాలస్తీనాలో దాగి ఉన్న ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులందరినీ ఉగ్రవాదులుగా చూడాలన్నారు. అమాయకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులపై బాంబులు, తుపాకీలతో దాడులకు తెగబడుతున్న పాలస్తీనాకు కాంగ్రెస్, మిత్ర పక్షాలు మద్దుతివ్వడం సరికాదన్నారు.