సూర్యుడిపై ఇస్రో ఫోకస్.. త్వరలో ‘ఆదిత్య-ఎల్‌ 1’ శాటిలైట్ ప్రయోగం

by Vinod kumar |
సూర్యుడిపై ఇస్రో ఫోకస్.. త్వరలో ‘ఆదిత్య-ఎల్‌ 1’ శాటిలైట్ ప్రయోగం
X

బెంగళూరు: ఓ వైపు చంద్రుడి దిశగా చంద్రయాన్‌-3 స్పేస్ క్రాఫ్ట్‌ను పంపిన.. మరోవైపు సూర్యుడిపైనా ఫోకస్ పెట్టింది. సూర్యుడిపై రీసెర్చ్ కోసం తొలిసారిగా "ఆదిత్య-ఎల్‌ 1" ప్రయోగానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. "ఆదిత్య-ఎల్‌ 1" అనేది ఒక శాటిలైట్. సెప్టెంబరు మొదటి వారంలో పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక ద్వారా ఈ శాటిలైట్‌ను నింగిలోకి పంపనున్నారు. 1500 కిలోల బరువు ఉండే ‘ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1)’ ఫోటోలను సోమవారం సోషల్‌ మీడియాలో ఇస్రో షేర్ చేసింది.

కరోనాగ్రఫీ పరికరం సాయంతో సూర్యుడి చుట్టూ ఉండే వాతావరణంపై రీసెర్చ్ చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రయోగంలో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సహకారాన్ని ఇస్రో తీసుకోనుంది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఆదిత్య-ఎల్‌ 1ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలో ఉంటే.. గ్రహణాల సమయంలోనూ నాన్ స్టాప్‌గా సూర్యుడిని స్టడీ చేసేందుకు వీలు ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed