చంద్రునిపై భారతీయుడు అడుగుపెట్టే వరకు ఇస్రో మూన్ మిషన్లు కొనసాగుతాయి: ఇస్రో ఛైర్మన్

by S Gopi |
చంద్రునిపై భారతీయుడు అడుగుపెట్టే వరకు ఇస్రో మూన్ మిషన్లు కొనసాగుతాయి: ఇస్రో ఛైర్మన్
X

దిశ, నేషనల్ బ్యూరో: గతేడాది చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో భవిష్యత్తులోనూ మరిన్ని మూన్ మిషన్లు కొనసాగుతాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ఛైర్మన్ ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు. బుధవారం గుజరాత్‌లోని ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన, చంద్రయాన్-3 విజయవంతంగా పూర్తి చేశాం. దాని ద్వారా డేటాను సేకరించి శాస్త్రీయ అధ్యయనం నిర్వహిస్తున్నాం. చంద్రుడిపై భారతీయుడు అడుగు పెట్టేవరకు చంద్రయాన్ సిరీస్‌లు కొనసాగించాలని భావిస్తున్నాం. దీనికి ముందు అనేక టెక్నాలజీలపై పరిశోధన చేయాలి. ముఖ్యంగా చంద్రుడిపై వెళ్లి రావడానికి పరిశోధనలు అవసరం. దీని గురించి వచ్చే మిషన్‌లో ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక సమయంలో గగన్‌యాన్ గురించి మాట్లాడిన సోమనాథ్.. ఈ ఏడాదిలో మానవరహిత మిషన్‌ను చేపడతాం. ఈ నెల 24న ఎయిర్‌డ్రాప్ టెస్టింగ్ చేస్తామని, వచ్చే ఏడాది మరో రెండు మానవరహిత యాత్రలను చేపట్టిన అనంతరం 2025 చివరికల్లా గగన్‌యాన్ ప్రయోగం నిర్వహిస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed