ISRO : ఇస్రో రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్.. నింగిలోకి 7 ఉపగ్రహాలు

by Vinod kumar |
ISRO : ఇస్రో రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్.. నింగిలోకి 7 ఉపగ్రహాలు
X

శ్రీహరికోట : ఇతర దేశాల ఉపగ్రహాలను లాంచ్ చేసే బిజినెస్‌లోనూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఆదివారం ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఉన్న మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను ఇస్రో తన పీఎస్‌ఎల్‌వీ సీ-56 రాకెట్ ద్వారా సక్సెస్ ఫుల్‌గా ప్రయోగించింది. దీని ద్వారా సింగపూర్‌ ప్రభుత్వానికి చెందిన ప్రధాన ఉప్రగ్రహం "డీఎస్‌-ఎస్ఏఆర్‌" తో పాటు ఆరు నానో శాటిలైట్లను ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది.

“డీఎస్-ఎస్ఏఆర్” (DS-SAR) విషయానికొస్తే.. దాని బరువు 360 కిలోలు. మిగితా ఆరు నానో శాటిలైట్ల బరువు 100 కిలోలు. ఈ ఏడాది ఇస్రో ప్రయోగించిన కమర్షియల్ శాటిలైట్ ప్రయోగాల్లో ఇది మూడోది కావడం విశేషం. ఉపగ్రహాలను కచ్చితమైన కక్ష్యలోకి వాహకనౌక ప్రవేశపెట్టిందని ఇస్రో అధిపతి డా. సోమనాథ్‌ వెల్లడించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘‘పీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపట్టబోతున్నాం. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం ఉంటుంది. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని సోమనాథ్‌ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed