- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 హిజ్బుల్లా టెర్రర్ టార్గెట్లపై దాడి చేసిన ఇజ్రాయిల్ ఆర్మీ
దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ లెబనాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. 40 టెర్రర్ టార్గెట్స్‌ని ద్వంసం చేసినట్టు బుధవారం ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఆర్టిలరీ, ఫైటర్ జెట్‌లతో దాడులు నిర్వహించినట్టు ఐడీఎఫ్ ధృవీకరించింది. ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) దక్షిణ లెబనాన్‌లోని ఐతా అల్-షాబ్ చుట్టూ ఉన్న స్టోరేజ్ కేంద్రాలతో సహా సుమారు 40 హిజ్బుల్లా టెర్రర్ లక్ష్యాలను ఛేదించినట్టు సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్‌కి ఉత్తరాన లెబనాన్ నుంచి క్రమం తప్పకుండా హిజ్బుల్లా మిలిటెంట్లు రాకెట్ లాంచర్లతో దాడులు కొనసాగిస్తున్నారు. తమ ఫైటర్లలో ఒకరిని చంపినందుకు ప్రతీకారంగా ఏకర్ నగరానికి ఉత్తరాన ఉన్న ఇజ్రాయెల్ స్థావరాలపై డ్రోన్ దాడులు ప్రారంభించామని లెబనీస్ గ్రూప్ హిజ్బుల్లా వెల్లడించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగింది. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ భూభాగంపై హిజ్బుల్లా చేసిన ఈ దాడి ఎక్కువ నష్టం కలిగించినట్టు తెలుస్తోంది. హమస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటుదారులు ఇరాక్ ఫ్రాక్సీలుగా పనిచేస్తున్నట్టు ఇజ్రాయెల్ ఆరోపణలు చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో జరిగిన హమాస్ దాడికి ఇరాన్ సహకరించిందని పేర్కొంది. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. గతవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేయడంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగొచ్చనే వార్తలొస్తున్నాయి. అలా జరిగితే ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది.