- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Israel: గాజాకు మానవతా సాయాన్ని నిలిపివేసిన ఇజ్రాయెల్

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని నిలిపివేస్తామని ప్రకటించింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ (Israel) ప్రకటించింది. కానీ, దీనికి హమాస్ నిరాకరించింది. దీంతో గాజా (Gaza)కు అందే మానవతాసాయాన్ని తాము అడ్డుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ పీఎంవో ప్రకటనలో.. ‘తొలి దశ ఒప్పందం ముగియడంతో దాన్ని కొనసాగించే ప్రతిపాదనకు మేం కట్టుబడి ఉన్నాం. అయితే, హమాస్ మాత్రం నిరాకరించింది. దీంతో, ఆదివారం ఉదయం నుంచి గాజాలోకి వెళ్లే అన్ని వస్తువుల సరఫరాలను నిలిపివేయాలని ప్రధాని నెతన్యాహు (Benjamin Netanyahu) నిర్ణయించుకున్నారు. మా బందీలను విడుదల చేయకుండా పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించేది లేదు. ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోతే హమాస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించింది.
కాల్పుల విరమణ ఒప్పందం
ఇటీవలే ఈజిప్టు, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas)ల మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాగా.. ఈ ఒప్పందం శనివారంతో ముగిసింది. ఈ క్రమంలోనే రంజాన్ సందర్భంగా తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు పొడిగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కోఫ్ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా హమాస్ తొలిరోజే తమ ఆధీనంలోని సగం మంది బందీలను విడుదల చేయాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ తెలిపింది. దీనికి హమాస్ నిరాకరించింది. ఈ క్రమంలోనే ఇజ్రాయల్ ను ఈ ప్రకటన వెలువడింది. దీనిపై హమాస్ స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. రెండో దశ కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు కైరోలో కొనసాగుతున్నాయి.