- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel: ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దాడి..19 మంది మృతి
దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై ఇజ్రాయెల్ (Israel) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఘర్షణ వల్ల నిరాశ్రయులైన ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఉత్తర గాజా (Northern gaza)లోని ఓ ఇంటిపై బుధవారం వైమాణిక దాడి చేసింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో నలుగురు పిల్లలు, వారి తల్లిదండ్రులు సహా ఒకే ఫ్యామిలీకి చెందిన ఎనిమిది మంది ఉన్నారు. బీట్ లాహియా(Beet Lahiya) ప్రాంతంలోని సరిహద్దు సమీపంలో ఇజ్రాయెల్ దాడి చేసిందని పాలస్తీనా వైద్య అధికారులు తెలిపారు. అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) స్పందించలేదు. అక్టోబర్ ప్రారంభం నుంచి ఉత్తర గాజాలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ మళ్లీ దాడి చేస్తోంది. ఇది కాకుండా సెంట్రల్ గాజాలోని నుస్రెట్ శరణార్థుల శిబిరంపై జరిగిన దాడిలో ఏడుగురు మరణించినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. సామాన్య ప్రజలను రక్షించేందుకు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించినప్పటికీ అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
కాగా, గతేడాది అక్టోబరు 7న హమాస్ నేతృత్వంలోని మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి చొరబడి దాదాపు 1,200 మందిని చంపి, 250 మందిని బంధీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు వర్గాల భీకర దాడులు జరుతుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 44,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 17,000 మందికి పైగా మిలిటెంట్లను ఇజ్రాయెల్ హతమార్చింది. ఇంకా హమాస్ మిలిటెంట్ల చెరలో 100 మంది బంధీలుగా ఉన్నారు. అయితే వారిని విడిపించాలని ఇజ్రాయెల్‌లో నిరసనలు తెలుపుతున్నా ఆ దిశగా చర్చలు జరగడం లేదు.