ఓం బిర్లా కుమార్తెపై ఫేక్ న్యూస్.. యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై కేసు నమోదు

by Shamantha N |
ఓం బిర్లా కుమార్తెపై ఫేక్ న్యూస్.. యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తెపై ఎక్స్‌లో ఫేక్ న్యూస్ ని పోస్టు చేశాడనే ఆరోపణలపై మహారాష్ట్ర సైబర్ క్రైం అధికారులు కేసు పెట్టారు. పేరడీ అకౌంట్ లో ఓం బిర్లా కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలపై ధ్రువ్ రాఠీపై కేసు నమోదైంది. @dhruvrahtee హ్యాండిల్‌తో ఉన్న ఎక్స్ అకౌంట్‌లో స్పీకర్ ఓం బిర్లా కుమార్తె యూపీఎస్సీ పరీక్షకు హాజరుకాకుండానే పాస్ అయ్యిందని ఫేక్ న్యూస్ పోస్టు చేశారు.

కొత్త నేరచట్టాల కింద కేసు నమోదు

ఓం బిర్లా బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు యూట్యూబర్ పై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరువునష్టం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ దాఖలైంది. అయితే, ఈ అకౌంట్ కూడా ఫేక్ అని.. ఇది తనకు చెందిన అధికారిక ఖాతా కాదని ధ్రువ్ రాఠీ పోలీసులకు తెలిపారు. ఫేక్ అకౌంట్ విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇకపోతే, అదే పేరడీ ఖాతా నుంచి శనివారం మరో ట్వీట్ పోస్టు అయ్యింది. ‘‘@MahaCyber1 నిర్దేశించినట్లుగా, నేను అంజలీ బిర్లాని ఉద్దేశించి చేసిన పోస్టులు తొలగించాను. వాస్తవాలు తెలియక, వేరొకరి ట్వీట్స్ కాపీ చేసి షేర్ చేసినందుకు క్షమాపణలు చెప్తున్నా’’ అని మహారాష్ట్ర సైబర్ టీమ్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed