- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీమా కుంభకోణం కేసులో.. మాజీ గవర్నర్ సహాయకుల ఇళ్లల్లో సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సహాయకుల ఇళ్లల్లో సీబీఐ బుధవారం సోదాలు నిర్వహించింది. బీమా కుంభకోణం కేసులో ఢిల్లీ, రాజస్థాన్‌లోని 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, రాజస్థాన్‌లోని సత్యపాల్ సహాయకులు సౌనక్ బాలి, చార్టర్డ్ అకౌంటెంట్ సంజయ్ నారంగ్, వీరేందర్ సింగ్ రాణా, కన్వర్ సింగ్ రాణా, ప్రియాంక చౌదరి, అనిత నివాసాల్లో సోదాలు ప్రారంభించామని సీబీఐ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం ఢిల్లీలోని 10 చోట్ల, రాజస్థాన్‌లోని రెండు చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆర్థిక పత్రాల విశ్లేషణ, డిజిటల్ సాక్ష్యాలు, కేసులో నిందితులు, ఇతర వ్యక్తుల వాంగ్మూలాల తర్వాత ఈ సోదాలు అనివార్యమైందని అధికారులు చెప్పారు. ఈ కేసులో సత్యపాల్‌ను ఏప్రిల్ 28న సీబీఐ ప్రశ్నించింది.
ఒక నెలలోపే దర్యాప్తు సంస్థ ఈ సోదాలు నిర్వహించడం గమనార్హం. సత్యపాల్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి సీబీఐ రెండు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసింది. మొదటిది.. ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ మెడికల్ ఇన్‌ష్యూరెన్స్ స్కీం కోసం కాంట్రాక్ట్‌ల మంజూరు, రెండోది.. జమ్మూ-కశ్మీర్‌లోని కిరు జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,200 కోట్ల విలువైన సివిల్ పనులు. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30వ తేదీ మధ్య తాను జమ్మూ-కశ్మీర్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఈ రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి రూ.300 కోట్లు లంచం ఆఫర్ చేశారని సత్యపాల్ చెప్పారు. దీంతో ఆరోగ్య బీమా పథకానికి సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో రిలయన్స్ జనరల్ ఇన్‌ష్యూరెన్స్, ట్రినిటి రీ- ఇన్‌ష్యూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్‌ను దర్యాప్తు సంస్థ నిందితులుగా పేర్కొంది.