తుది ద‌శ‌కు 'ఆప‌రేష‌న్ గంగ'! రేప‌టితో బంద్‌!!

by Sumithra |
తుది ద‌శ‌కు ఆప‌రేష‌న్ గంగ! రేప‌టితో బంద్‌!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు మొద‌లుపెట్టినప్ప‌ నుండి భ‌యాందోళ‌న‌ల మ‌ధ్య ఆ దేశంలోని భార‌తీయులు కూడా వ‌ణికిపోయారు. యుద్ధం ప్రారంభం కాక‌మునుపే అమెరికా వారి దేశ‌స్థుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లిస్తే, భార‌తీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లోనే చిక్కుకుపోయారు. బంక‌ర్ల‌లో దాక్కుంటూ కొంద‌రు, స్వంత మార్గాల్లో స‌రిహ‌ద్దులు దాటుకుంటూ ఇంకొంద‌రు యుద్ధ భూమి నుండి త‌మ‌ను ర‌క్షించుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇలాంటి క్లిష్ట‌ప‌రిస్థితుల్లో భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉక్రెయిన్‌లో భార‌తీయ మెడిక‌ల్ విద్యార్థులు అధికంగా ఉండ‌టంతో వారిని స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి 'ఆప‌రేష‌న్ గంగ' పేరుతో త‌ర‌లింపును ప్రారంభించింది. ఒక విధంగా యుద్ధంలో ర‌ష్యా కొన్ని గంట‌లు విరామం ప్ర‌క‌టించ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు. ఇక‌, మార్చి నెల ప్రారంభంలో మొద‌లైన ఈ ప్ర‌క్రియ రేప‌టితో ముగియ‌నుంది. దాదాపుగా విద్యార్థులంద‌ర్నీ త‌ర‌లించిన ఇండియా రేపు ఉక్రెయిన్ నుండి భార‌త‌ ప్రభుత్వ బృందాల త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నుంది. రేపు సాయంత్రం నాటికి, ఆపరేషన్ గంగ‌ కింద చివరి విమానాలు ఇండియాకు బ‌య‌లుదేర‌నున్నాయ‌ని తెలుస్తోంది.

Advertisement

Next Story