PM jabs Congress: కాంగ్రెస్ క్రూరత్వానికి పాల్పడుతోంది.. కాంగ్రెస్ పై మండిపడ్డ ప్రధాని మోడీ

by Shamantha N |
PM jabs Congress: కాంగ్రెస్ క్రూరత్వానికి పాల్పడుతోంది.. కాంగ్రెస్ పై మండిపడ్డ ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ "క్రూరత్వానికి పాల్పడుతోందని" ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. కశ్మీర్‌లోని దోడాలో ఒక సభలో ప్రసంగించిన మోడీ.. అమెరికాలో జర్నలిస్టుని కాంగ్రెస్ అవమానించిందని ఆగ్రహం వ్యక్త చేశారు. "కాంగ్రెస్ మొహబ్బత్ కీ దుకాన్(ప్రేమను పంచే దుకాణం) నడుపుతున్నట్లు చెప్పుకుంటారు. కానీ మన దేశానికి చెందిన ఒక జర్నలిస్టును అమెరికాలో కాంగ్రెస్ అవమానించింది. విదేశీ గడ్డలో భారతదేశ బిడ్డను అవమానించారు. వాక్ స్వాతంత్య్రానికి చాంపియన్లుగా చెప్పుకునే వారు క్రూరత్వంతో మునిగిపోయారు.” అని మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టు పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు అమెరికా గడ్డపై దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని అన్నారు. “రాజ్యాంగం” అనే పదం కాంగ్రెస్‌కు సరిపోదని విమర్శించారు. ‘ప్రజాస్వామ్యానికి మీడియా మూల స్తంభం.. ఓ జర్నలిస్టును గదిలో బంధించి ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య గౌరవాన్ని చాటిచెప్పే విషయమా? జర్నలిస్టుపై దాడి చేసి దే ప్రతిష్టను పెంచుతున్నారా? రాజ్యాంగం అనే పదం మీ నోటికి తగునా?’’ అని మోడీ ప్రశ్నించారు.

అసలేం జరిగిందంటే?

ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఒక జర్నలిస్టుపై దాడి జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. రాహుల్ గాంధీ బృందం ఆ ఘటనకు పాల్పడినట్లు వాటి సారాంశం. కాగా.. జమ్మూకశ్మీర్‌ పర్యటనలో జర్నలిస్టుపై దాడి గురించి ప్రస్తావిస్తూ హస్తం పార్టీపై మోడీ ధ్వజమెత్తారు.

Advertisement

Next Story