- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల రుణమాఫీ పైనే ‘ఇండియా’ తొలి నిర్ణయం: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేయడమే మొదటి పని అని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. మూడో దశ ఎన్నికలతో బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు. ఫిరోజాబాద్ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అఖిలేష్ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన రూ.16,000 కోట్ల రుణాలు మాఫీ చేసిందని, కానీ రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయలేదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలి నిర్ణయం దేశ వ్యాప్తంగా రైతుల రుణాలను రద్దు చేయడంపైనే ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ హయాంలో రైతుల ఆదాయం ఏ మాత్రం పెరగలేదని తెలిపారు. అలాగే పేదలకు ఉచితంగా ఆటా పిండి అందజేస్తామని, దీనివల్ల పేదలు పౌష్టికాహారం పొంతుతారని చెప్పారు. నిరుద్యోగం, పరీక్షా పత్రాల లీక్‌కు బీజేపీయే కారణమన్నారు.