కీలక వ్యాఖ్యలు చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

by S Gopi |
కీలక వ్యాఖ్యలు చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
X

న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రక్షణ ఎగుమతుల రికార్డు స్థాయికి చేరాయని చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 15,920 కోట్ల ఎగుమతలు చేశామని శనివారం వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ విధమైన పెరుగుదలను ఒక అద్భుతమైన విజయంగా అభివర్ణించారు. అంతకుముందు 2021-22కు గానూ రూ.12,814 కోట్ల ఎగుమతులు జరిగినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ప్రధాని మోడీ నాయకత్వంలో రక్షణ ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నాయని రాజ్ నాథ్ చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వం 2024-25 కల్లా రూ.1,75,000 కోట్ల రక్షణ పరికరాల తయారీతోపాటు, రూ.35,000 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed