- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
US Elections 2024లో సత్తా చాటిన ఇండియన్ అమెరికన్స్
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయానికి కేవలం ఒక్క అడుగు దూరంలో నిలబడి ఉంది. దీంతో డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూఎస్ ప్రెసిడెంట్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో ఇండియన్స్‌దే కీలక పాత్రగా చెప్పొచ్చు. ఇండియన్ల ఓట్లు దక్కించుకునేందుకు ఇటు రిపబ్లికన్లు, అటు డెమోక్రాట్లు బాగానే ప్రయత్నించారు. ఇదిలా ఉంటే ఇండియన్ ఓటర్లే కాదు.. ఎన్నికల్లో కూడా కొంతమంది ఇండియన్స్ పోటీచేసి సూపర్ విక్టరీ సాధించారు. వాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్ఓ ఖన్నా:
డెమోక్రాట్ల తరపున బరిలోకి దిగిన భారత సంతతికి చెందిన ఆర్‌ఓ ఖన్నా కాలిఫోర్నియా లోని 17వ డిస్ట్రిక్ట్ నుంచి విజయం దక్కించుకున్నారు. ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని అనైటా చెన్‌ని సునాయాసంగా ఓడించి రెండోసారి విజయం దక్కించుకున్నారు. అయితే ఆర్ఓ ఖన్నాకి ఇది రెండో విజయం. ఇంతకుముందు 2016లో కూడా ఆయన ఇక్కడి నుంచి సూపర్ విక్టరీ సాధించారు.
సుహాస్ సుబ్రహ్మణ్యం:
అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రహ్మణ్యం ఓ రకంగా చరిత్ర సృష్టించారనే చెప్పాలి. డెమోక్రాట్ పార్టీకి చెందిన సుహాస్.. వర్జీనియాలోని 10వ డిస్ట్రిక్ట్ నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే తూర్పు యూఎస్ ప్రాంతంలో విజయం దక్కించుకున్న తొలి భారతీయ మూలాలున్న వ్యక్తిగా సుహాస్ రికార్డులకెక్కారు. ఇక ఈ ఎన్నికలకు ముందు ఆయన వర్జీనియా సెనేటర్‌గా ఉన్నారు.
శ్రీ థానేదార్:
భారతీయ మూలాలున్న కాంగ్రెస్‌మెన్ శ్రీ థానేదార్ డెమోక్రాట్ల తరపున మిషిగన్‌లోని 13వ డిస్ట్రిక్ట్‌లో పోటీ చేసి బంపర్ విక్టరీ సాధించారు. ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మార్టెల్ బివింగ్స్‌ని 35 శాతం ఓట్ల తేడాతో ఓడించి గెలుపు ఢంకా మోగించారు.
రాజా క్రిష్ణమూర్తి:
ఇల్లినాయిస్‌లోని 7వ డిస్ట్రిక్ట్ నుంచి బరిలో నిలిచిన ఇండియన్ అమెరికన్ రాజా క్రిష్ణమూర్తి ఏకంగా ఐదోసారి గెలిచి రికార్డ్ సృష్టించారు. డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన కృష్ణమూర్తి ఈ సారి కూడా కాంగ్రెస్‌మెన్‌గా అమెరికన్ కాంగ్రెస్‌లో అడుగుపెట్టబోతున్నారు.
డాక్టర్ అమి బేరా:
కాలిఫోర్నియాలోని 6వ డిస్ట్రిక్ట్ నుంచి పోటీకి దిగిన ఇండియన్ అమెరికన్ డాక్టర్ అమి బేరా 2013 నుంచి కాంగ్రెస్ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు మరోసారి గెలుపు బావుటా ఎగురవేసి మళ్లీ కాంగ్రెస్ సభలో అడుగుపెట్టబోతున్నారు.
వీళ్లే కాకుండా అరిజోనాలో డెమోక్రాట్ల తరపున పోటీ చేస్తున్న ఇండియన్ అమెరికా షా ప్రత్యర్థి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డేవిడ్ స్వియెట్ కంటే ముందంజలో ఉన్నారు.
Read More..
Elon Musk: అమెరికా ఫలితాలపై మస్క్ పోస్ట్.. కొత్త స్టార్ అంటూ ట్రంప్ ప్రశంసలు