- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తోటి ప్యాసింజర్‌పై విద్యార్థి మూత్ర విసర్జన.. నిషేధం విధించిన ఎయిర్‌లైన్స్
న్యూఢిల్లీ: పక్క ప్యాసింజర్‌పై మూత్ర విసర్జన చేసిన భారతీయ విద్యార్థికి అమెరికా ఎయిర్‌లైన్స్ షాక్ ఇచ్చింది. ఇకపై తమ ఎయిర్ లైన్స్‌లో ప్రయాణం చేయకుండా నిషేధం విధించింది. శనివారం శనివారం న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న సమయంలో యూఎస్‌లో చదువుకుంటున్న 21 ఏళ్ల అర్య వొహ్రా తన పక్కన కూర్చున్న ప్యాసింజర్‌పై మూత్ర విసర్జన చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనపై ఎయిర్ లైన్స్ చర్యలకు దిగింది.
‘ఇకపై సదరు విద్యార్థి ప్యాసింజర్ తమ విమానాల్లో ప్రయాణించకుండా ఆదేశాలు విధించింది. ప్యాసింజర్ చర్యలు మత్తు ఎక్కువై అతిగా ప్రవర్తించాడు. విమాన సిబ్బంది సూచనలను పాటించడం లేదు. ఆపరేటింగ్ సిబ్బందితో పదేపదే వాదిస్తూ ప్రమాదకరంగా వ్యవహరించాడు’ అని తెలిపింది. దీనిపై ఎయిర్ పోర్ట్ పోలీసులు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. భారత విమానయాన నియంత్రణ వ్యవస్థ కూడా పూర్తి నివేదికను కోరింది. గతేడాది ముంబైకి చెందిన వ్యక్తి తన తోటి ప్యాసింజర్ పై ఇదే విధంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురుకాగా, అతడిని అరెస్టు కూడా చేశారు.