US Firing: అమెరికాలో భారత సంతతికి చెందిన యువకుడు మృతి

by Shamantha N |   ( Updated:2024-08-17 15:22:35.0  )
US Firing: అమెరికాలో భారత సంతతికి చెందిన యువకుడు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో భారత సంతతకి చెందిన యువకుడు చనిపోయాడు. నార్త్ కరోలినాలోని స్టోర్ లో దోపిడీకోసం వచ్చిన దుండగులు కాల్పుల్లో 36 ఏళ్ల మైనాంక్ మరణించాడు. 2580 ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో టొబాకో హౌస్ పేరుతో కన్వీనియన్స్ స్టోర్‌ను మైనాంక్ పటేల్ నిర్వహిస్తున్నాడు. నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం అతడి స్టోర్‌లో దోపిడీ జరిగింది. పటేల్ పై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన పటేల్ ను హాస్పిటల్ కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మైనర్ అరెస్టు

కాగా, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఒక మైనర్ బాలుడు పటేల్‌పై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. బాలుడ్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుడ్ని మంగళవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు రోవాన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. స్టోర్ లో దోపిడీ కోసమే పటేల్ ని కాల్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇకపోతే, మైనాంక్ పటేల్ కు గర్భిణీ భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. మరోవైపు పటేల్ హత్య గురించి తెలుసుకున్న కస్టమర్లు విచారం వ్యక్తం చేశారు. బుధవారం అతడి షాపు వద్ద అతడి ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ‘మైక్’గా పిలుచుకునే పటేల్‌ ఉదారమైన, దయగల వ్యక్తి అని కస్టమర్లు పేర్కొన్నారు. పేటల్ కుటుంబం వారివద్ద పనిచేస్తున్న వారిని ఆదరిస్తుందని స్టోర్ లో పనిచేసే మరొకరు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed