'భారత్ ఎన్నటికీ తలవంచదు': చైనాతో సరిహద్దు చర్చలపై రాజ్‌నాథ్ సింగ్

by S Gopi |
భారత్ ఎన్నటికీ తలవంచదు: చైనాతో సరిహద్దు చర్చలపై రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, చైనా మధ్య చర్చలు సజావుగా, సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్ ఎన్నటికీ తలొంచదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అహ్మదాబాద్‌లో ప్రచారానికి వెళ్లిన రాజ్‌నాథ్ సింగ్.. సైనిక పరంగా భారత్ శక్తివంతమైన దేశంగా మారిందని, పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. 'భారత్ ఇకపై బలహీనమైన దేశం కాదని పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చైనా దురాక్రమణ గురించి ప్రధాని మోడీపై చేసిన ఆరోపణల నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ పైవ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ చర్చలు సజావుగా, మంచి వాతావరణంలో కొనసాగుతున్నాయి. చర్చల ఫలితాల కోసం కొంత సమయం వేచి ఉండాలి. అయితే, ఏ సందర్భంలోనూ భారత్ ఎన్నటికీ తలంచదని, ఈ విషయంలో తాను దేశ ప్రజలకు భరోసా ఇస్తున్నానని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఇదే సమయంలో 2023-24కి రూ. 21,000 కోట్ల భారత రక్షణ ఎగుమతులు నమోదయ్యాయని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 2014 సమయంలో రూ. 600 కోట్ల రక్షణ ఉత్పత్తులు ఎగుమతి జరిగాయని, అది ఇప్పుడు రూ. 21 వేల కోట్లు దాటడం వృద్ధి దోహదపడుతుందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇక, క్షిపణులు, బాంబులు, ఇతర ఆయుధాలను దేశీయంగానే, స్థానిక ప్రజల చేతుల్లోనే తయారయ్యేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed