- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ దేశాల జాబితాలో చేరిన భారత్.. కొన్ని దేశాలు మాత్రమే సాధించాయి: PM Modi
దిశ, వెబ్‌డెస్క్: భారత తన రక్షణ రంగంలో రోజురోజుకూ పటిష్టంగా తయారవుతోంది. రక్షణ శాఖలకు కావలసిన దాదాపు అన్ని ఆయుధాలను భారత్ తన సొంతగా తయారు చేసుకుంటుంది. అయితే తాజాగా భారత దేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహన నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధాని మోదీ కొచ్చిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు భారత్ సరికొత్త ఘనత సాధించిందని, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరిందని మోదీ పేర్కొన్నారు.
ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే విమాన వాహక నౌకలను తయారు చేసుకున్నాయని, ఇప్పుడు భారత్ కూడా సొంత ఎయిర్ క్యారియర్‌ను తయారు చేసుకుందని మోదీ వెల్లడించారు. 'ఈరోజు భారత్ అభివృద్ధి చెందిన దేశాల లీగ్‌లో చేరింది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు మరో అడుగు ముందుకేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధ నౌకే కాదు. ఇది 21వ శతాబ్దపు భారత నిబద్ధతకు నిదర్శనం' అని మోదీ చెప్పుకొచ్చారు.
Also Read : ఇండియన్ నేవీకి సరికొత్త చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ..