'భారతదేశ ప్రజాస్వామ్యం చైతన్యవంతమైనది'

by Vinod kumar |
భారతదేశ ప్రజాస్వామ్యం చైతన్యవంతమైనది
X

వాషింగ్టన్ : "భారత్‌ మాకు ఎందుకు ముఖ్యమైన దేశం.. అనేది చెప్పేందుకు నేను చాలా ఉదాహరణలు చెప్పగలను" అని అమెరికా జాతీయ భద్రతా మండలి కోఆర్డినేటర్ (స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్) జాన్‌ కెర్బీ అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం చైతన్యవంతమైనదని.. ఢిల్లీకి వెళ్లి నేరుగా చూసి ఈ విషయాన్ని తెలుసుకోవచ్చని ఆయన కొనియాడారు. జూన్​ 22న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భారత ప్రధాని మోడీ భేటీ కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాన్‌ కెర్బీ ఈ కామెంట్స్ చేశారు.

"ఇరుదేశాల వాణిజ్యంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. భారత్‌ "క్వాడ్‌"లో సభ్య దేశం. ఇండో-పసిఫిక్‌ వ్యూహంలోనూ ఇండియా మాకు కీలక భాగస్వామి. ఇండియా ఎందుకు ముఖ్యమైన దేశమో.. ఇంకా చాలా ఉదాహరణలను చెప్పగలను. అందుకే ప్రధాని మోడీ పర్యటన ద్వారా ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఎదురు చూస్తున్నారు" అని కెర్బీ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed