UAE : యూఏఈ న్యూక్లియర్ ప్లాంట్ బాధ్యతలు భారత సంస్థకు!

by Hajipasha |   ( Updated:2024-09-09 15:32:52.0  )
UAE : యూఏఈ న్యూక్లియర్ ప్లాంట్ బాధ్యతలు భారత సంస్థకు!
X

దిశ, నేషనల్ బ్యూరో : అబుధాబి యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పర్యటన వేళ సోమవారం భారత్, యూఏఈ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అణు ఇంధనం, పెట్రోలియం రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన కొన్ని అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. యూఏఈకి చెందిన ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ, భారత్‌‌కు చెందిన న్యూక్లియర్ పవర్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) మధ్య ఒక ఎంఓయూ కుదిరింది.

ఇందులో భాగంగా యూఏఈలోని బరఖా న్యూక్లియర్ పవర్ ప్లాంటు కార్యకలాపాలు, నిర్వహణ విషయాల్లో ఇరుసంస్థలు కలిసి పనిచేయనున్నాయి. అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు ఎల్ఎన్‌జీ సప్లైకు సంబంధించిన దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి. భారత్‌లో ఫుడ్ పార్క్‌ల అభివృద్ధికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వం, అబుధాబికి చెందిన పీజేఎస్‌సీ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది.

Advertisement

Next Story

Most Viewed