- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Parliament : పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతల ఆందోళన
దిశ, వెబ్ డెస్క్ : అదానీ గ్రూప్ (Adani Group) ముడుపుల వ్యవహారంపై ఉభయసభల్లో చర్చించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణ(Parliament premises)లో ఇండియా కూటమి నేతలు, ఎంపీలు(India Alliance leaders)ఆందోళన చేపట్టారు. అదానీ గ్రూప్ ముడుపుల వ్యవహారంపై సభ లోపల ఆందోళన చేస్తే వాయిదా వేస్తున్నందున సభ వెలుపల ఆందోళనకు దిగామని ఇండియా కూటమి నేతలు వెల్లడించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభం కాగానే విపక్షాలు అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. ఉదయం సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణకు చేరుకున్న ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన తెలిపారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సహా పలువురు ఎంపీలు పార్లమెంట్ ముందు ఆందోళన చేశారు. ఫ్లకార్డులను చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఇక సమావేశాలు ప్రారంభమయ్యాక సభలోనూ వారు ఆందోళన కొనసాగించారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లోనూ అదానీ గ్రూప్ ముడుపుల వ్యవహారంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రచ్చ కొనసాగుతూ సమావేశాలు వాయిదా పర్వంలో సాగిపోతున్నాయి. అయితే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో లోక్‌సభలో, రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు సోమవారం ఓ అంగీకారానికి రావడం జరిగింది. రాజ్యాంగంపై లోక్‌సభలో ఈ నెల 13, 14 తేదీల్లోనూ, రాజ్యసభలో ఈ నెల 16, 17 తేదీల్లోనూ చర్చించేందుకు అంగీకారం కుదిరింది. పార్లమెంటు కార్యకలాపాలు మంగళవారం నుంచి సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు అంగీకరించాయి. ఈ సమావేశాల్లో అదానీపై అమెరికాలో కేసు, సంభల్ హింసాకాండ, మణిపూర్ అల్లర్లపై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు మాత్రం తమ వైఖరి వీడకుండా సభ బయట నిరసన తెలిపాయి.