మాల్దీవుల నుంచి సైనికుల ఉపసంహరణకు భారత్ అంగీకారం: అధ్యక్షుడు మహ్మద్ ముయిజు

by Anjali |
మాల్దీవుల నుంచి సైనికుల ఉపసంహరణకు భారత్ అంగీకారం: అధ్యక్షుడు మహ్మద్ ముయిజు
X

న్యూఢిల్లీ: మాల్దీవుల నుంచి సైనికులను ఉపసంహరించుకునేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని ఆ దేశ నూతన అధ్యక్షుడు మహ్మద్‌ మయిజు ఆదివారం ప్రకటనలో తెలిపారు. 'మేము జరిపిన చర్చల్లో భారత ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది. అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు తాము ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించామని' విలేకరుల సమావేశంలో మహ్మద్ తెలిపారు. భారత అధికారులతో దుబాయ్ వేదికగా పర్యావరణ సదస్సు కాప్-28 క్లైమెట్ సమ్మిట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మహాసముద్రంలో చిన్నదీవుల సమూహమైన మాల్దీవులపై పట్టుకోసం భారత్, చైనా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం భారత్‌కు చెందిన దాదాపు 70 మందితో కూడిన సైన్యం అక్కడ ఉంటోంది. భారత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. మాల్దీవులకు కొన్ని సైనిక పరికరాలను, విపత్తు సహాయం, నౌకాదళ డాక్‌యార్డ్‌ను నిర్మించడంలో సహాయం చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed