ఐరాసలో పాకిస్తాన్‌కు భారత్ షాక్.. ఏం జరిగింది ?

by Hajipasha |
india pakistan
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ఇస్లామోఫోబియా’’‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోయింది. చైనా సహా పలు దేశాలు మద్దతు పలికిన ఈ తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ‘‘హిందుత్వం, బౌద్ధం, సిక్కు మతాలకు చెందినవారు కూడా హింస, వివక్షలకు గురవుతున్నప్పుడు కేవలం ఇస్లామ్‌ను మాత్రమే ఈ తీర్మానంలో చేర్చడం సరికాదు. మతహింసను ఎదుర్కొంటున్న ఇతర వర్గాలనూ పరిగణనలోకి తీసుకోవాలి’’ అని భారత్ అభిప్రాయపడింది. ఈమేరకు ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ పాకిస్తాన్‌కు హితవు పలికారు. సెమిటిజం, క్రిస్టియన్‌ఫోబియా, ఇస్లామోఫోబియాలతో ప్రేరేపించబడే హింసలకు భారత్ వ్యతిరేకంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇక 193 మంది సభ్యుల ఐరాస జనరల్ అసెంబ్లీలో 115 మంది పాకిస్తాన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటువేశారు. ఏ దేశం కూడా వ్యతిరేకించలేదు. భారతదేశం, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్, యూకే సహా 44 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed