INC: జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు సైనికులు మృతి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంతాపం

by Ramesh Goud |   ( Updated:2024-12-24 15:23:33.0  )
INC: జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు సైనికులు మృతి.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్(Jammu And Kashmir) లో ఆర్మీ వాహనం లోయలో పడి ఐదుగురు సైనికులు మృతి(Five Soldiers Died) చెందారు. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress National President Mallikarjun Kharge) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జవాన్లకు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన.. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా(Poonch district)లో జరిగిన వాహన దుర్ఘటనలో ఐదుగురు వీర భారత ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారనే భయంకరమైన వార్త(Terrible News) తీవ్ర వేదనకు గురి చేసిందని అన్నారు. ధైర్యవంతులైన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి(Deepest Condolences) తెలియజేశారు. అలాగే దేశానికి వారి త్యాగం, నిస్వార్థ సేవకు సెల్యూట్(Salute) చేస్తున్నానని అన్నారు. అంతేగాక మా ఆలోచనలు ప్రమాదంలో గాయపడిన వారితో ఉన్నాయని, వారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ఖర్గే అన్నారు.

Next Story

Most Viewed