ఇరకాటంలో మహారాష్ట్ర బీజేపీ.. విమర్శల పాలవుతున్న ఫడ్నవీస్..!!

by GSrikanth |   ( Updated:2022-08-09 10:30:31.0  )
ఇరకాటంలో మహారాష్ట్ర బీజేపీ.. విమర్శల పాలవుతున్న ఫడ్నవీస్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజకీయంలో ప్రకంపలను సృష్టించిన టిక్ టాక్ స్టార్ పూజా చవాన్ ఆత్మహత్య అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. 2021 ఫిబ్రవరి 8న పూణెలోని వనవాడి ప్రాంతంలో ఉన్న హైవెన్ పార్క్ బిల్డింగ్‌పై నుంచి దూకి పూజా సూసైడ్ చేసుకోగా ఆ టాపిక్ ఇప్పుడు తెరపైకి వచ్చి బీజేపీపై తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. గతంలో ఉద్ధవ్ ఠాక్రేను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ ఇష్యూ ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు రాజకీయంగా విమర్శల పాలు చేస్తోంది.

అప్పటి హంతకుడు ఇప్పుడు పునీతుడయ్యాడా?

తాజాగా మహారాష్ట్రలో కొలువుదీరిన వారిలో ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన సంజయ్‌ రాథోడ్‌ ఒకరు. ఇతనిపై గతంలో బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పూజా చవాన్‌ ఆత్మహత్యకు అప్పటి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పని చేసిన సంజయ్ రాథోడ్ కారణం అని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అతడిని అరెస్ట్ చేయాలని మహారాష్ట్ర బీజేపీ డిమాండ్ చేసింది. పూజా చవాన్ చనిపోయిన కొన్ని రోజులకు సోషల్ మీడియాలో ఆమె పేరుతో ఆడియో క్లిప్స్ వైరల్‌గా కాగా, ఆ ఆడియో క్లిప్స్‌లో పూజా చవాన్‌తో రాథోడ్‌కు సంబంధాలున్నట్లు స్పష్టమైందని బీజేపీ దుమ్మెత్తిపోసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఏకంగా డీజీపీ హేమంత్‌కు లేఖ రాయడం అప్పట్లో సంచనం అయింది. తన కూతురి ఆత్మహత్య విషయంలో ఎవరిపై అనుమానాలు లేవని ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పూజా చవాన్ తల్లిదండ్రులు స్పష్టం చేసినా మంత్రిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టుబట్టింది. విపక్షాల ఒత్తిడి పెరిగిపోవడంతో ఆయన్ను మంత్రి పదవి నుండి ఉద్దవ్ తొలగించారు. అలాంటి రాథోడ్ కు తాజాగా ఏక్ నాథ్ షిండే వర్గం -బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో తిరిగి మంత్రి పదవి కట్టబెట్టడం ఏంటనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడు హంతకుడు మీ వర్గంలో చేరిపోగానే పునీతుడు అయ్యాడా అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

అందువల్లే అతడికి మంత్రి పదవి ఇచ్చాం:

పూజా చవాన్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి తిరిగి మంత్రి పదవిలో చోటు కల్పించడాన్ని సీఎం ఏక్ నాథ్ షిండే సమర్ధించారు. ప్రభుత్వ విచారణలో అతనికి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారని అందువల్లే మేము అతనిని మంత్రి వర్గంలోకి తీసుకున్నామన్నారు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే మాట్లాడుతామని క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా సంజయ్ రాథోడ్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో రాథోడ్ ను అరెస్ట్ చేయాలని గతంలో బీజేపీ చేసిన వీడియో క్లింప్పింగ్ లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మంగళవారం జరిగిన జరిగిన కేబినెట్ విస్తరణలో భాగంగా బీజేపీ, శివసేన(ఏక్ నాథ్ షిండే వర్గ)లకు చెందిన చెరో 9 మంది కి కేబినెట్లో అవకాశం లభించింది. మొత్తం 18 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది.

కదులుతున్న రైలు నుంచి ప్రయాణికుడిని కిందకి తోసిన రైల్వే సిబ్బంది.

Advertisement

Next Story

Most Viewed