మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారు: ప్రధాని మోడీ

by Mahesh |
మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారు: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మహా యుతి(NDA) కూటమి 288 స్థానాలకు గాను 231 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో కేంద్రంలో ఉన్న బీజేపీ(bjp) తమ కూటమి పార్టీలతో కలిపి మూడో సారి అధికారంలోకి వచ్చింది. ఈ విజయంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లోను బీజేపీ(BJP), దాని మిత్ర పక్షాలు సత్తా చాటాయి. దీంతో ఢిల్లీ బీజేపీ కార్యాలయం(Delhi BJP office)లో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ విజయోత్సవ సభకు ప్రధాని మోడీ(Prime Minister Modi)తో పాటు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రి నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మహారాష్ట్ర విజయంపై మాట్లాడుతూ.. మహారాష్ట్రలో విభజనవాదులు ఘోర పరాజయం పాలయ్యారని, కుటుంబ రాజకీయాలు ఓడిపోయాయని అన్నారు.

ఈ ఎన్నికల్లో అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి.. వికసిత్‌ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. UP, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో బీజేపీకి బలం చేకూరింది. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు షిండే, ఫడ్నవీస్‌, అజిత్‌పవార్‌కు అభినందనలు తెలిపారు. అలాగే మహారాష్ట్ర 50 ఏళ్ల చరిత్రలో ఇది అతి పెద్ద విజయం అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఇండియా కూటమి 231 స్థానాల్లో విజయం సాధించగా.. ఇండియా కూటమి కేవలం 45 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఏ పార్టీ కూడా ప్రతిపక్ష హోదాకు కావలసిన సీట్లను సాధించలేకపోవడం తో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు లేకుండా పోయినట్లయింది.

Advertisement

Next Story

Most Viewed