BMW Hit-And-Run Case: ముంబై బీఎండబ్ల్యూ కేసులో మరో ట్విస్ట్

by Shamantha N |
BMW Hit-And-Run Case: ముంబై బీఎండబ్ల్యూ కేసులో మరో ట్విస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై బీఎండబ్ల్యూ కారు ప్రమాద కేసులో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. అయితే, మద్యం మత్తులో నిందితుడు మహిర్ షా కారు నడిపినట్లు పోలీసులు తేల్చారు. కాకపోతే, ఫోరెన్సిక్ నివేదిక మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మిహిర్ రక్తనమూనాలో ఎక్కడా ఆల్కహాల్ జాడ లేదని పేర్కొంది. హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రొటోకాల్ ప్రకారం ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించడం సాధారణమని పోలీసులు తెలిపారు. అయితే, తాగిన తర్వాత 12 గంటలు దాటితే ఆ నివేదికలు పనికిరావని అన్నారు. ప్రమాదం జరిగిన 58 గంటల తర్వాత నిందతుడు మిహిర్ షాను అరెస్టు చేశామని వెల్లడించారు. అతని శరీరం నుండి మద్యం ఆనవాళ్లు కనిపించకపోవడానికి ఈ సమయం సరిపోతుందని పేర్కొన్నారు. శుక్రవారమే నివేదిక అందినట్లు వర్లీ పోలీసులు తెలిపారు. అయితే, ఫోరెన్సిక్ నివేదికలో మద్యం తాగినట్లు తేలితే పోలీసులకు అది ఉపయోగపడుతోంది. కానీ, కోర్టులో కేసుని సమర్పించేందుకు ఫోరెన్సిక్ నివేదిక పనికిరాదు. ఇప్పుడు పోలీసులు ఇతరసాక్ష్యాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

వర్లీలో కారు ప్రమాదం

కాగా, జులై 7న ముంబైలోని వర్లీ ప్రాంతంలో తెల్లవారుజామున మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారుని వేగంగా నడుపుతూ బైక్ ని ఢీకొట్టాడు. దీంతో ఆ బైక్ పై ఉన్న ఇద్దరు దంపతులు ఎగిరిరోడ్డుపై పడ్డారు. మహిళ స్పాట్ లో చనిపోగా.. ఆమె భర్తగాయాలతో బయటపడ్డారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం మిహిర్ షా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed