- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Menstruation: పురుషులకూ పీరియడ్స్ ఉంటే అర్థమయ్యేది: సుప్రీంకోర్టు ఆగ్రహం
దిశ, నేషనల్ బ్యూరో: పురుషులకూ పీరియడ్స్(Menstruation) ఉంటే అర్థమయ్యేదని, దాని బాధ ఏమిటో తెలిసి వచ్చేదని ఓ పిటిషన్ విచారిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొంది. పని చేయకుంటే తొలగించడంలో తప్పేమీ లేదని, కానీ, వారు శారీరకంగా, మానసికంగా బాధపడుతున్నప్పుడు పని చేయడం లేదని నిర్దారించడం, ముఖ్యంగా మహిళల విషయంలో ఇది సరికాదని తెలిపింది. మహిళా జడ్జీలపై మధ్యప్రదేశ్ హైకోర్టు(Madhya Pradesh High Court) తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టింది. మధ్యప్రదేశ్‌లో ఆరుగురు మహిళా సివిల్ జడ్జీల(Women Judges) పర్ఫార్మెన్స్ సరిగా లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది పేర్కొంది. వారిని తొలగించాలనే సిఫారసులతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రొబేషన్‌లో ఉన్న ఆరుగురు మహిళా న్యాయమూర్తులను 2023 జూన్‌లో తొలగించింది. ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్ మరోసారి పునరాలోచించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ సూచనలతో నలుగురు మహిళా జడ్జీలను తిరిగి విధుల్లోకి తీసుకుంది. దీంతో మిగిలిన ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, ఎన్‌కే సింగ్‌ల ధర్మాసనం విచారిస్తున్నది.
ఈ ఇద్దరిలో ఒకరి డిస్పోజల్ రేట్(కేసుల పరిష్కారం) మరీ తక్కువగా ఉన్నదని, ఏడాదిలో రెండు సివిల్ సూట్‌లు మాత్రమే డిస్పోజ్ చేశారని కోర్టులో మధ్యప్రదేశ్ హైకోర్టు కౌన్సెల్ తెలిపారు. ఆ కాలంలో సదరు అధికారిణికి గర్భస్రావమైందని, ఆమె మానసిక అనారోగ్యంతో సరైన ప్రదర్శన ఇవ్వలేదని రికార్డులను జస్టిస్ నాగరత్న పరిశీలించారు. దీనికితోడు ఆమెకు కోవిడ్ కూడా వచ్చిందని, ఆమె సోదరుడికి క్యాన్సర్ వచ్చిందని ఆమె తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలుక చేశారు. ‘ఇదే షరతు(పర్ఫార్మెన్స్ ఆధారంగా తొలగించడం) పురుషులకూ ఉండాల్సింది. ఆ కాలంలో ఆ అధికారిణి గర్భం దాల్చింది. గర్భస్రావానికీ గురైంది. అసలు పురుషులకు కూడా రుతుస్రావం ఉంటే ఈ బాధ అర్థమయ్యేది. ఒక మహిళా అధికారిణితో ఒక హైకోర్టు ఇలా వ్యవహరించడం బాధాకరం. తనకు గర్భస్రావం జరిగిందని ఆమె స్పష్టం రాసింది’ అని జస్టిస్ నాగరత్న ఆగ్రహించారు. ‘ఇదే షరతు పురుషులకూ పెట్టండి. ఎంతమందిని మీరు తొలగిస్తారో చూద్దాం. పర్ఫార్మెన్స్ చూడండి! పర్ఫార్మెన్స్ చూడండి! అని కౌన్సెల్ చెబుతున్నారు. ఈ కేసు విచారణ తర్వాత తమ విచారణ చాలా నెమ్మదిగా సాగుతున్నదని లాయర్లు చెప్పగలరా? అసలు ఈ టార్గెట్ల లక్ష్యమేంటీ? డిస్మిస్.. డిస్మిస్ అని పలకడం సులువే. జిల్లా కోర్టులో తరుచూ వినిపించేదే. ఆమె అలా చేయలేదని మాత్రం చెప్పకండి. శారీరకంగా, మానసికంగా బాధపడుతున్నప్పుడు వారు పని చేయడం లేదని అనకండి’ అని వివరించారు. అనంతరం, ఈ కేసులో ఇక వాదించనని హైకోర్టు కౌన్సిల్ స్పష్టం చేశారు. కేసు విచారణ డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేశారు.