- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జయంత్ సింగ్‌ను విడిచిపెట్టకపోతే నన్ను చంపేస్తామంటున్నారు: ఎంపీ సౌగత రాయ్
దిశ, నేషనల్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభ ఎంపీ సౌగతా రాయ్ తనకు హత్య బెదిరింపు కాల్స్ వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల అరెస్ట్ అయిన అదే పార్టీకి చెందిన జయంత్ సింగ్‌ను త్వరగా విడుదల చేయకపోతే చంపేస్తామని కాల్‌లో బెదిరించారని సౌగతా రాయ్ పేర్కొన్నారు. తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి జయంత్ సింగ్‌ను విడుదల చేయకపోతే నన్ను చంపేస్తానని అన్నాడు, అలాగే, అరియాదాహకు వెళ్ళిన కూడా చంపేస్తానని అతను వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా, కాల్ చేసిన వ్యక్తి నన్ను తిట్టాడు, రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయంపై బరాక్‌పూర్ పోలీస్ కమిషనర్‌ను సంప్రదించి నంబర్‌ను ట్రాక్ చేయమని అభ్యర్థించడంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సౌగత రాయ్ చెప్పారు.
జూన్ 30న కళాశాల విద్యార్థి, అతని తల్లిపై కొంతమంది వ్యక్తులు దాడి చేయగా, దానికి సంబంధించిన వీడియో క్లిప్ వైరల్‌గా మారడంతో, ఈ దాడిలో జయంత్ సింగ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి జయంత్ సింగ్ సన్నిహితుడు మంగళవారం అర్ధరాత్రి పట్టుబడ్డాడు. అయితే 2023లో మరో కేసులో అరెస్టయి, ఇకపై ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా బాండ్‌తో బెయిల్‌పై బయటకు వచ్చిన జయంత్ సింగ్, ఇప్పుడు తాజాగా మరో దాడి కేసులో ఇరుక్కోవడం గమనార్హం.