- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఐఏఎస్ అధికారి కుక్క తప్పిపోతే.. సెర్చ్ ఆపరేషనా..!
దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని బిలౌవాలో ఓ ఐఎఎస్ అధికారికి చెందిన కుక్క కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు గత రెండు రోజులుగా సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారు. కుక్కను కనిపెట్టేందుకు పోలీసు అధికారులను పిలిచారు. కానీ సెర్చ్ ఆపరేషన్ విఫలమవడంతో తప్పిపోయిన కుక్క ఫోటోలతో పోస్టర్లను వేశారు. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన బ్యూరోక్రాట్ ఢిల్లీలో పోస్టింగ్ దృష్ట్యా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను రెండు కుక్కలను ఢిల్లీ నుంచి భోపాల్‌కు తీసుకువెళుతున్నారు.
ఈ క్రమంలోనే కారులోని సిబ్బంది ఆహారం కోెసం ఓ ధాబా వద్ద ఆగారు. సిబ్బంది భోజనం చేస్తుండగా కుక్కలు రెండూ కారులోంచి బయటకు వెళ్లిపోయాయి. అంతలోనే సిబ్బది చుట్టుపక్కల ప్రాంతాలను వెతికి అందులో ఓ కుక్కను పట్టుకున్నారు, మరో దానిని కనిపెట్టలేకపోయారు. సిబ్బంది మొత్తం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినా కుక్క ఎక్కడా కనిపించలేదు. దీంతో దాబా మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో తప్పిపోయిన కుక్క ఫొటోతో పోస్టర్లు వేశారు. చివరకు పోలీసులు గ్వాలియర్ జంతు ప్రదర్శన శాల నుంచి సిబ్బందిని కూడా రప్పించి కుక్క కోసం వెతుకుతూనే ఉన్నారు.