Border: బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దు వెంబడి విమానాలు, హోవర్‌క్రాఫ్ట్‌ల మోహరింపు

by Harish |
Border: బంగ్లాదేశ్ సముద్ర సరిహద్దు వెంబడి విమానాలు, హోవర్‌క్రాఫ్ట్‌ల మోహరింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిని అడ్డుకోవడానికి సరిహద్దులో నిఘాను మరింత పటిష్టం చేస్తున్నారు. అందులో భాగంగా బంగ్లాదేశ్‌తో సముద్ర సరిహద్దు వెంబడి ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG), విమానాలు, హోవర్‌క్రాఫ్ట్‌లు ఇతర నౌకలతో నిఘా కార్యకలాపాలు మరింత ముమ్మరం చేసింది. దేశంలోకి అక్రమ చొరబాట్లను నిరోధించడానికి అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వెంబడి భద్రతను పటిష్టం చేసింది. సాధారణ రోజుల్లో కంటే ఇప్పుడు భారత తీర రక్షక దళం పెట్రోలింగ్, నిఘాను పెంచింది. ప్రస్తుతం అక్కడ అదనంగా సిబ్బందితో పాటు, రెండు మూడు నౌకలు మోహరించారు.

అధికారులు సుందర్‌బన్ క్రీక్ ప్రాంతాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎయిర్ కుషన్ వెస్‌ల్స్, ఇంటర్‌సెప్టర్ బోట్‌లు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. హల్దియా, పరదీప్, గోపాల్‌పూర్‌లోని ఇండియన్ కోస్ట్ గార్డ్ తీరప్రాంత నిఘా రాడార్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. అవి సమీప తీరప్రాంతాలను నిరంతరం స్కాన్ చేస్తూ సిబ్బందికి సమాచారాన్ని అందిస్తున్నాయి. ఒక అధికారి తాజాగా మాట్లాడుతూ, ఇప్పటివరకు అయితే ఎటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు కనిపించలేదు, ఇండో-బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ మారిటైమ్ బోర్డర్ లైన్ (IMBL) దగ్గరగా ఉన్న అన్ని ఫిషింగ్ బోట్‌లు, ఇతర ఓడలను అక్కడి నుంచి పంపించినట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed