శ్రీనగర్ దాల్ సరస్సులో మంచు పొరలు!

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-05 06:42:36.0  )
శ్రీనగర్ దాల్ సరస్సులో మంచు పొరలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వింటర్ సీజన్ ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల జమ్ముకాశ్మీర్‌లో హిమపాతం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల అక్కడి నదులపై మంచుతో కప్పబడిన పొరలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ శ్రీనగర్‌లోని టూరిస్ట్ స్పాట్ అయిన దాల్ సరస్సుపై మంచుతో పలుచని పొర కప్పబడి ఉంది. ఈ సరస్సులో పడవలు నడుపుకుంటూ స్థానికులు జీవనోపాధి పొందుతుంటారు. కాగా, ఈ మంచుపొరలు కప్పబడిన సుందర దృశ్యాలను చూడడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed