24 ఏళ్లుగా నన్ను తిడుతూనే ఉన్నారు.. ప్రతిపక్షాల విమర్శలపై కేజ్రీవాల్ రియాక్షన్

by Shamantha N |   ( Updated:2024-05-28 09:27:42.0  )
24 ఏళ్లుగా నన్ను తిడుతూనే ఉన్నారు.. ప్రతిపక్షాల విమర్శలపై కేజ్రీవాల్ రియాక్షన్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల చివరి పోలింగ్ ముందు ప్రతిపక్షాల విమర్శలపై ప్రధాని మోడీ స్పందించారు. తనను ప్రతిపక్షాలు తిట్టడం రోజూ వింటూనే ఉన్నానని.. చివరకు ఆ గాలి మాటలు పట్టించుకోవట్లేదని అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తనను 101 సార్లు విపక్షాలు తిట్టాయని పార్లమెంట్ సభ్యులు లెక్కించినట్లు తెలిపారు. ఎన్నికలు ఉన్నా, లేకపోయినా ప్రతిపక్షాల ప్రవర్తన మాత్రం మారదన్నారు. తిట్టడమనేది వారి స్వభావమని ఫైర్ అయ్యారు. గత 24 ఏళ్లుగా తనను తిడుతూనే ఉన్నారని పేర్కొన్నారు.

కేంద్ర ఏజెన్సీలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వస్తున్న కామెంట్లపై మోడీ స్పందించారు. ‘‘మీరు చేసే కామెంట్లకు నిదర్శనం ఏంటని చెత్తను విసిరే వ్యక్తిని అడగండి. నేను ఆ చెత్తను ఎరువుగా మార్చి, ఈ దేశం కోసం మంచి ఉత్పత్తులను అందిస్తాను.” అని అన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్న టైంలో కేవలం రూ.34 లక్షలనే స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. కానీ గత పదేళ్ల కాలంలో రూ.2,200 కోట్లను ఈడీ సీజ్ చేసిందన్నారు. దేశానికి అన్ని వేలకోట్లు తెచ్చిన వ్యక్తిని గౌరవించాలని..తిట్టొద్దని పేర్కొన్నారు. డబ్బుని చోరీ చేసి పట్టుబడ్డాక దొంగ అరుస్తూనే ఉంటాడని అన్నారు. తమ ప్రభుత్వం అవినీతిని అస్సలు సహించదని స్పష్టం చేశారు. ఎవరు జైలుకు వెళ్లాలో మోడీ నిర్ణయిస్తారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యక్తులు దేశ రాజ్యాంగం, చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తాను ఎవరికీ ఏం చెప్పాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ కు చురకలు అంటించారు.

Read More..

చివరి దశ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed