నేను శ్రీకృష్ణుడి గోపికను అంటున్న బీజేపీ అభ్యర్థి

by Hajipasha |
నేను శ్రీకృష్ణుడి గోపికను అంటున్న బీజేపీ అభ్యర్థి
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి హేమ మాలిని తనను తాను శ్రీకృష్ణుడి గోపికగా చెప్పుకున్నారు. తప్పకుండా తనపై శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటుందని ఆమె అన్నారు. మధుర లోక్‌సభ స్థానం పరిధిలోని బ్రజ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ హేమ మాలిని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘శ్రీకృష్ణుడికి బ్రజ్ ప్రాంత ప్రజలు అంటే ఎంతో ఇష్టం. ఇక్కడి వారికి నేను హృదయపూర్వకంగా సేవ చేస్తే.. తప్పకుండా నాపై శ్రీకృష్ణుడి ఆశీస్సులు ప్రసరిస్తాయి’’ అని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘నేను పేరు కోసమో.. కీర్తి కోసమో రాజకీయాల్లోకి రాలేదు. భౌతిక ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదు’’ అని స్పష్టం చేశారు. మధుర ప్రాంతానికి సేవ చేసేందుకు తనకు మరో అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మధుర లోక్‌సభ స్థానం నుంచి హేమమాలిని పోటీ చేస్తుండటం ఇది మూడోసారి.

Advertisement

Next Story