నల్లా నీళ్లలో మానవ మలమూత్రాలు.. ఆందోళనలో గ్రామస్తులు.. అసలు విషయం తెలియడంతో షాక్

by Prasad Jukanti |   ( Updated:2024-05-16 12:34:35.0  )
నల్లా నీళ్లలో మానవ మలమూత్రాలు.. ఆందోళనలో గ్రామస్తులు.. అసలు విషయం తెలియడంతో షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎవరైనా కలుషితమైన నీరు తాగితే అది అనారోగ్యానికి దారితీస్తుంది. అలాంటిది ఓ గ్రామంలో చాలా ఇళ్లకు సరఫరా అయిన నల్లా నీళ్లలో మానవ మల మూత్రాలు కలిపితే ఎలా ఉంటుంది. తాజాగా ఆలాంటి ఘటన ఒకటి కలకలం రేపింది. తీరా విచారణలో అసలు విషయం తెలియడంతో ఆ గ్రామస్తులు నివ్వెరపోయారు. తమిళనాడులోని విలుప్పురం జిల్లా కంచనూరు పంచాయతీకి చెందిన కేఆర్ పాలెం అనే గ్రామంలో ఓ బావి ఉంది. బావి నుంచే కేఆర్ పాలెం గ్రామంలో నివసిస్తున్న 100 మందికి పైగా ఇళ్లకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఇటీవల సరఫరా అయిన నాల్లా నీళ్లలో మాన మలం కలిసినట్లుగా కొన్ని అవశేషాలు కనిపించాయి. దీంతో గ్రామస్తులు కలకలం చెందారు. నల్లాలో వచ్చిన నీళ్లలో ఎవరో దుండగులు మానవ మలమూత్రాలు కలిపి కలుషితం చేశారని ఆందోళన చెందారు. తెలియక కొంత మంది అవే నీటిని ఉపయోగగా వారంతా తమ ఆరోగ్యం పరిస్థితి ఏమవుతుందో అని టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో ఈ విషయం అధికారుల దృష్టికి చేరింది. దీంతో విచారణ ప్రారంభించిన అధికారులు బావిని పరిశీలించగా నీళ్లలో కలిసింది మలమూత్రాలు కావని అది తేనే తెట్టే అని నిర్థారించారు. తేనె తెట్టే బావిలో పడిపోవడంతో అవి మానవ మలమూత్ర విర్జన అవశేషాలుగా గ్రామస్తులు భావించారని తేల్చారు. దీంతో ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా నల్లా నీళ్లు తాగేవారు ఎవరైనా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story