పొరుగు దేశాల కవ్వింపు.. రక్షణ శాఖకు బడ్జెట్‌లో పెద్దపీట

by GSrikanth |   ( Updated:2023-02-01 10:49:28.0  )
పొరుగు దేశాల కవ్వింపు.. రక్షణ శాఖకు బడ్జెట్‌లో పెద్దపీట
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రక్షణకు 2023-24 బడ్జెట్ లో కేంద్రం పెద్దపీట వేసింది. దేశ సరిహద్దుల్లో పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్, చైనా నుంచి ఎదరవుతున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మిగతా శాఖల కంటే రక్షణ రంగానికి ఈ సారి భారీగా నిధులు కేటాయించింది. రక్షణ రంగానికి 5.94 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు రూ. 2.70 లక్షల కోట్లు, రైల్వేలకు రూ. 2.41 లక్షల కోట్లు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాలు శాఖకు రూ.2.06 లక్షల కోట్లు కేటాయించింది. హోం మంత్రిత్వ శాఖకు రూ.1.96 లక్షల కోట్లు, రసాయన మరియు ఎరువుల శాఖకు రూ. 1.78 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.1.60 లక్షల కోట్లు, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు రూ.1.25 లక్షల కోట్లు, ప్రసార శాఖకు రూ.1.23 లక్షల కోట్లు కేటాయించింది.

ఇవి కూడా చదవండి: Budget 2023: పార్లమెంట్‌లో టంగ్ స్లిప్ అయిన Nirmala Sitharaman

Advertisement

Next Story