2022-23లో బీజేపీకి భారీ విరాళాలు: ఏడీఆర్ నివేదికలో వెల్లడి

by samatah |
2022-23లో బీజేపీకి భారీ విరాళాలు: ఏడీఆర్ నివేదికలో వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి 7,945మంది దాతల నుంచి రూ.720కోట్ల విరాళం వచ్చినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక తెలిపింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 17.12శాతం ఎక్కువ. 2021-22లో 614.62కోట్ల విరాళాలు బీజేపీకి వచ్చాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలకు వచ్చిన విరాళాల కంటే ఐదు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2022-23లో జాతీయ పార్టీలు మొత్తం రూ.850.43 కోట్ల విరాళాలు అందుకున్నాయి. అందులో కాంగ్రెస్‌కు రూ.80కోట్లు రాగా..సీపీఎంకు 3.9కోట్లు, ఆప్‌కు 1.14కోట్ల విరాళాలు అందాయి.

ఢిల్లీ నుంచి రూ.276కోట్లు

జాతీయ పార్టీలకు ఢిల్లీ నుంచి రూ.276 కోట్లు విరాళాలు అందగా..గుజరాత్ నుంచి రూ.160.509కోట్లు, మహారాష్ట్ర నుంచి రూ.96.273 కోట్ల విరాళాలు అందినట్టు ఏడీఆర్ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీల మొత్తం విరాళాలు రూ.91.701 కోట్లు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే ఇది 12.09 శాతం ఎక్కువ. ఇక, మరో జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) 2022-23లో రూ.20 వేలకు మించి విరాళాలు అందలేదని ప్రకటించింది. గత 17 ఏళ్లుగా బీఎస్పీ ఇదే తరహా విషయాన్ని వెల్లడిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed