Coromandel express accident :కోరమండల్ రైలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?

by Mahesh |   ( Updated:2023-09-01 15:12:56.0  )
Coromandel express accident  :కోరమండల్ రైలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘోర సంఘటనలో మొత్తం మూడు రైళ్లు ప్రమాదానికి గురి కాగా 273 మందికి పైగా చనిపోయారు. అలాగే మరో 900 పైచిలుకు ప్రయాణికులు గాయపడ్డారు. ఇంకా 500 నుండి 700 మంది వరకు రైలు బోగిలలో ఇరుక్కుని ఉన్నారు. దీంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దశాబ్దంలో ఇంతటి భారీ ప్రమాదం ఎన్నడు జరగలేదని అధికారులు చెబుతున్నారు. మరి ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఓ తెలుసుకుందాం..

మూడు రెళ్ల రైలు ప్రమాదం ఎలా జరిగింది..?

రైలు నెంబర్..12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ షాలిమార్ స్టేషన్ నుండి మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:30 గంటలకు బాలాసోర్ చేరుకుంది. సుమారు రాత్రి 7:20 గంటలకు బాలేశ్వర్ సమీపంలో రైలు 10 నుండి 12 కోచ్‌లు పట్టాలు తప్పి ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. సాయంత్రం 6:55 గంటలకు, డౌన్‌లైన్‌లో ప్రయాణిస్తున్న 12864 బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్‌లను ఢీకొట్టింది. ఈ రైలులోని మూడు నాలుగు బోగీలు ప్రమాదానికి గురయ్యాయి. అనంతరం మొదట ప్రమాదానికి గురైన రెలు భోగిలను గూడ్స్ రైలు యొక్క వ్యాగన్‌లతో ఢీకొన్నాయి.

Also Read...

Coromandel express accident :కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ : ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే (వీడియో)

బ్రేకింగ్: ఒడిషాకు ప్రధాని మోడీ.. రైలు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించనున్న పీఎం!

Advertisement

Next Story

Most Viewed