- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుమారం రేపుతున్న హిండెన్ బర్గ్ నివేదిక.. అదానీకి RSS మద్దతు!
దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదిక వ్యవహారం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్న తరుణంలో అదానీకి ఆర్ఎస్ఎస్ మద్దతుగా నిలిచింది. అదానీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించింది. అదానీపై దాడి 2023 జనవరిలో మొదలు కాలేదని ఇది 2016-17లోనే ప్రారంభమైందని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అమర్ ఉజాలా అనే హిందీ డైలీ శనివారం ఓ కథనంలో పేర్కొంది. భారతీయులకు అదానీ వ్యతిరేకం అనే ప్రయత్నాలు చాలా కాలంగా సాగుతున్నాయని ఇది ఆస్ట్రేలియాలో మొదలైందని ఈ కథనం పేర్కొంది.
అదానీ పరువు తీయడం కోసమే ఆస్ట్రేలియన్ ఎన్డీఓ బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ (బీబీఎఫ్) ప్రత్యేకంగా వెబ్ సైట్ నిర్వహిస్తోందని అమర్ ఉజాలా ప్రచురించింది. ఈ వెబ్ సైట్ అదానీకి చెందిన కంపెనీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని నెగిటివ్‌గా చూపిస్తుందని అయితే కాంగ్రెస్, టీఎంసీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని అదానీ ప్రాజెక్టులను మాత్రం బీబీఎఫ్ టార్గెట్ చేయదని వెల్లడించింది. జార్జ్ సోరోస్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ థాయ్‌లాండ్‌లను ఎలా విచ్ఛిన్నం చేశారో అదానీపై ప్రస్తుతం జరుగుతున్న దాడి కూడా అలాంటిదే అని పేర్కొంది.