- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Himachal: హిమాచల్‌లో పునరుద్ధరణ పనుల కోసం తాత్కాలిక వంతెనల నిర్మాణం
దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా చాలామంది గల్లంతయ్యారు. రాంపూర్‌లోని సమేజ్‌లో గురువారం సంభవించిన క్లౌడ్ బరస్ట్ ప్రభావితం ప్రాంతాల్లో రెస్క్యూ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. భారత సైన్యం, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎస్, హోంగార్డు, సీబీఎస్ఎఫ్ బృందాలు ఈ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టేందుకు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే ఆదివారం రెస్క్యూ కార్యకలాపాలను సులభతరం చేసేందుకు కనెక్టివిటీ తెగిపోయిన ప్రాంతాల మధ్య తాత్కాలిక వంతెనలను నిర్మించారు. దీనికి సంబంధించి జాతీయ మీడియాతో మాట్లాడిన రాంపూర్ ఎస్‌డీఎం నిశాంత్ తోమర్.. నాలుగు గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు మార్గం లేదని, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు తాత్కాలిక వనెంతను నిర్మించాం. సర్పర గ్రామంలో రోడ్డు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రజలకు సాయమందించేందుకు భారత సైన్యం బాధిత కుటుంబాలకు ఆహార పదార్థాలను అందిస్తోంది. నదులు, వాగుల వద్దకు వెళ్లొద్దని ప్రజలకు సూచిస్తున్నామని వివరించారు. ఐదు జేసీబీఅను మోహించాం. వివిధ బృందాలు సమన్వయంతో ఎక్కువ మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి నాలుగు రోజులు. యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తాం. టాస్క్‌ఫోర్స్‌లకు వేర్వేరుగా బాధ్యతలు అప్పగించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.