- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీపై హీరో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన కొత్త పార్లమెంట్ ను ప్రధాని మోడీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. కాగా పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు విపక్ష పార్టీలు రేపటి వేడుకకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాయి. కాగా కొత్త పార్లమెంట్ వివాదంపై ప్రముఖ హీరో, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు రాకూడదో దేశ ప్రజలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశాధినేత అయిన రాష్ట్రపతిని ఈ వేడుకకు దూరంగా ఉంచడానికి తనకైతే ఒక్క కారణం కూడా కనబడటం లేదని కమల్ అన్నారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకను జరుపుకోవడానికి తాను కూడా సపోర్టు చేస్తానని, కానీ రాష్ట్రపతిని పిలవకపోవడాన్ని మాత్రం తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రారంభోత్సవ ఆహ్వాన ప్రక్రియలో విపక్షాలను భాగస్వామ్యం చేయకపోవడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రపతిని ప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానిస్తే బాగుంటుందని కమల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read more:
దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు: సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు